సమరయస్త్రీ-గొంగళిపురుగు


అంశం: సమరయస్త్రీ-గొంగళిపురుగు.....
 Message by: పాస్టర్ కె.సుధాకర్ గారు 

       
👉 *సమరయస్త్రీని బైబిల్ పండితులు గొంగళిపురుగుతో పోలుస్తారు. గొంగళిపురుగులాగానే మార్చబడిన జీవితం సమరయస్త్రీది.* 

♻ *మొదటగా మనం గొంగళిపురుగు పురుగుకోసం చూద్దాం!*

👉ఇది ఎవరికీ ఇష్టం లేని ఒక అసహ్యమైన పురుగు. ఒంటినిండా ముళ్ళు, ముట్టుకొంటే చాలు గుచ్చుకోపోతాయి. చూస్తేనేచాలు చంపాలి అనిపిస్తుంది. పిల్లలు దానిని చూస్తే జడుసుకొంటారు. చివరకి పక్షులుకూడా వాటిని తినడానికి ఇష్టపడవు.

   అవి పుట్టిన తర్వాత పచ్చని ఆకులు తిని, త్వరత్వరగా ఎదుగుతాయి. అలుపులేకుండా ఆహారం కోసం తిరిగి పచ్చదనాన్ని ఖాళీచేస్తాయి. కొంచెం ఎదిగిన తర్వాత తనలాంటి పురుగులతో కలసి చెట్టు కాండానికి పట్టి, మొదటగా చెట్టుబెరడును, తర్వాత మొక్కలో ఉన్న జీవాన్ని పీల్చివేస్తాయి. ఈరకంగా మొక్కలను పాడుచేసే ఒకరకమైన చీడపురుగు!
 ఇంతవరకూ వీటిని చంపడానికి మందు కనిపెట్టలేదు!   

అయితే గొంగళిపురుగు పెద్దదైన తర్వాత దానికి ఒకరకమైన భయంకరమైన నిద్రముంచుకొస్తుంది. దానికోసం అనువైన ప్రాంతంకోసం ఎత్తైన,ఎవరూ తన నిద్రను భంగం కలిగించని ప్రాంతాన్ని ఎన్నుకొని, అక్కడ తన నోటినుండి లాలాజలంతో తనచుట్టూ ఒక గూడు కట్టుకొంటుంది. ఒకసారి గూడులోనికి వెళ్ళిన తర్వాత ఆహారం, లోకాన్ని మరచిపోయి సుదీర్ఘమైన నిద్రపోతుంది. 
*ఆ నిద్రలో తనకి రూపాంతరం జరుగుతుంది.*

 *నవజీవనం కలుగుతుంది. గొంగళిపురుగుగా చనిపోయి అందమైన సీతాకోకచిలుకగా బయటికి వస్తుంది.*

 *నేలమీద, చెట్లుమీద ప్రాకే పురుగు ఇప్పుడు ఆకాశంలో రెక్కలతో ఎగురుతుంది.*

 *ఒకరోజు అందరూ తనని చూసి అసహ్యించుకొన్న గొంగళిపురుగు, మరల మరల చూడాలనిపించేటట్లుగా మారిపోతుంది.*

 *పిల్లలు చూసి జడుసుకొనే పురుగు, పిల్లలు తన వెంటపడే విధంగా మారిపోయింది.*
👉 అయితే అది అలా మారడానికి చాలాశ్రమ పడింది.

 👉ఇక సమరయస్త్రీ జీవితంలో కూడా ఇదే జరిగింది. 
🔺ఒకరోజు ప్రజలతో వ్యభిచారిగా, 
🔺కేరెక్టర్ లేని స్త్రీగా,
🔺 బజారుమనిషిగా,
🔺 అంటరానిదానిగా,
🔺 వెలివేయబడిన దానిగా ఎంచబడ్డ సమరయస్త్రీ-

 *బావిదగ్గర యేసయ్య దగ్గర రక్షణ పొందింది. తనపాపపు కుండను అక్కడే వదలివేసింది. భయంకరమైన వ్యభిచారం, అబద్దాలు, ఎందరినో తన కంటిచూపుతో ఆకర్షించిన తన మొహపుచూపు అన్నీ వదలివేసింది.*

👉 గొంగళిపురుగుకుండే ముళ్ళు పోయి రెక్కలు వచ్చి ఎగరడం ఎలా ప్రారంభించిదో, అలానే *పాపపు జీవితాన్ని విడచిన సమరయస్త్రీ- సాక్ష్యార్ధమైన బ్రతుకు కలిగింది.*

 👉అందరూ చీదరించుకొన్న సమరయస్త్రీని ఇప్పుడు అందరూ కావాలని కోరుకోనేలా మారిపోయింది. 
👉గ్రామానికి ఒక Role Model గా,
👉 ఒక వెన్నెముకుగా మారిపోయింది. 

*ఎప్పుడూ?*

*యేసయ్యని ఆహ్వానిచినప్పుడు!*

*పాపాన్ని విడచిపెట్టినప్పుడు!*

*తన పాపపుజీవితాన్ని సిగ్గువిడచి అందరికీ చెప్పినప్పుడు!*

  👉 సమరయస్త్రీని మార్చిన దేవుడు నిన్నుకూడా మార్చగలరు. 
👉నీ జీవితంలో కూడా గొప్ప అధ్బుతాన్ని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు.

అయితే ఆయనకీ నీ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకోవాలి!

  గొంగళిపురుగులా ఆ గూడులో సమాధి అయిపోవాలి.

 నీ పాపపు జీవితాన్ని ఒప్పుకొని, దానిని భాప్తిస్మం ద్వారా సమాదిచేయాలి!

 అప్పుడు క్రీస్తులోనికి భాప్తిస్మం పొందిన నీవు క్రీస్తుతో కూడా బ్రతికింపబడతావు!
పునరుత్థానం పొందుతావు.
(రోమా 6:3-9)

👉అప్పుడు నీజీవితం సీతాకోకచిలుకలా మారిపోతుంది. 
🔺నీభాష, 
🔺నీ ప్రవర్తన, 
🔺నీ అలవాట్లు అన్నీ మారిపోతాయి. 

ప్రజల్ని ఆకర్షించడానికి ప్రయంత్నిచిన సమరయస్త్రీ రక్షించబడి,

 ఎలా ప్రజలకి సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టిందో,

👉 అలాగే నీ జీవితంలో కూడా పాపం, అబద్దాలు, త్రాగుడు, చెడు అలవాట్లు అన్నీ పోయి గొంగళిపురుగు- సీతాకోకచిలుకలా పరివర్తన చెందినట్లు, 
పాపివైన నీవు కూడా నూతనసృష్టిగా మారిపోతావు!

 ఆమార్పు నీకు కావాలా?

👉 అయితే నేడే యేసునొద్దకు రా!
 
నీ జీవితాన్ని ప్రభుకివ్వు!

 ఆయన చేతులకు సంపూర్ణంగా సమర్పించుకో!
 దేవుడు నీ జీవితంలో అధ్బుతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు!

👉ఈ సమరయస్త్రీ జీవితం ద్వారా దేవుడు నీతో మాట్లాడారని ఆశిస్తున్నాను.
సమరయస్త్రీ పొందుకొన్న భాగ్యం మనందరికీ మెండుగా కలుగును గాక!

ఆమెన్!

Comments

Popular posts from this blog

Sermon about Occult

Life Can Be Tough

Are you in Trouble?