ఏ నీడలో ఉన్నావు? | Telugu Christian Message | Ps K.Sudhakar Garu |

ఏ నీడలో ఉన్నావు?




ఏ నీడలో ఉన్నావు?

గర్భంలో తల్లి నీడ, ఆత్మకు దేహపు నీడ, ఎండా వానలప్పుడు ఇంటి నీడ... ఇలా ఎన్నో నీడలు ఉన్నాయి.

i. ముళ్ల పొద నీడ (న్యాయాధి 9:15)
(చెట్లన్నీ కలిసి ముండ్లపొద యెద్దమనవి చేయగా, రండి! నా నీడను ఆశ్రయించండి అన్నది. ఇది శరీరేచ్ఛలూ, ఆకర్షణీయమైన కోరికల నీడ. మొదట ఆకర్షణ - తదుపరి ఆవేదన. ఈ నీడ మనకొద్దు!)

ii. సొరచెట్టు నీడ (యోనా 4:6)

(ఇది తాత్కాలికమైన నీడ, బంధుమిత్రులూ,
శారీరక బాంధవ్యాలూ అన్నీ ఈ నీడకు గుర్తు! సొరచెట్టు వాడిపోయినట్టే రేపటి దినం ఇవి
వాడిపోతాయి, ఓడిపోతాయి)

iii. బదరీ వృక్షపు నీడ (1రాజు 19:4)

(రోషంతో 850 మంది అబద్ద ప్రవక్తలను గెల్చిన ఏలీయా, యెజెబెలు బెదిరింపుతో బదరీ వృక్షం క్రిందకి వచ్చి పడ్డాడు. ఇది నిరుత్సాహమూ, భయమూ,
పిరికితనమూ అనే నీడ! అలాంటప్పుడు మనం నాల్గవ నీడలోకి పరుగెత్తి రావాలి అదే...

iv. జల్దారు వృక్షపు నీడ (పరమ 2:3)
(ఇది యేసుప్రభువు యొక్క రెక్కల నీడ. ఈ నీడలోకి వచ్చినవారికి ఆయనే ఆశ్రయం కల్పిస్తాడు. ఈ నీడలో ఆనందం, ఆశీర్వాదం, సమృద్ధి ఉంది. ఆ నీడలోకి మీరు వచ్చెదరా!)
శ్రమలూ శోధనలూ వచ్చినప్పుడు నీడ కావాలి అంటూ వెదుకుతూ వెళ్తాం. మొదటి మూడునీడలు మనలను ఆహ్వానిస్తాయి. నిజమని నమ్మి వాటి ఆశ్రయం పొందుతాం. ఇంక సమస్య జఠిలం అయిపోతుంది. అయితే మీరు యేసు నీడ జాడలోకి రండి!

Comments

Popular posts from this blog

ఆంశం : ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము*

Sermon on GOD'S MERCY TO NINEVEH