Posts

Showing posts from September, 2021

ఏ నీడలో ఉన్నావు? | Telugu Christian Message | Ps K.Sudhakar Garu |

Image
ఏ నీడలో ఉన్నావు? ఏ నీడలో ఉన్నావు? గర్భంలో తల్లి నీడ, ఆత్మకు దేహపు నీడ, ఎండా వానలప్పుడు ఇంటి నీడ... ఇలా ఎన్నో నీడలు ఉన్నాయి. i. ముళ్ల పొద నీడ  (న్యాయాధి 9:15) (చెట్లన్నీ కలిసి ముండ్లపొద యెద్దమనవి చేయగా, రండి! నా నీడను ఆశ్రయించండి అన్నది. ఇది శరీరేచ్ఛలూ, ఆకర్షణీయమైన కోరికల నీడ. మొదట ఆకర్షణ - తదుపరి ఆవేదన. ఈ నీడ మనకొద్దు!) ii. సొరచెట్టు నీడ  (యోనా 4:6) (ఇది తాత్కాలికమైన నీడ, బంధుమిత్రులూ, శారీరక బాంధవ్యాలూ అన్నీ ఈ నీడకు గుర్తు! సొరచెట్టు వాడిపోయినట్టే రేపటి దినం ఇవి వాడిపోతాయి, ఓడిపోతాయి) iii. బదరీ వృక్షపు నీడ  (1రాజు 19:4) (రోషంతో 850 మంది అబద్ద ప్రవక్తలను గెల్చిన ఏలీయా, యెజెబెలు బెదిరింపుతో బదరీ వృక్షం క్రిందకి వచ్చి పడ్డాడు. ఇది నిరుత్సాహమూ, భయమూ, పిరికితనమూ అనే నీడ! అలాంటప్పుడు మనం నాల్గవ నీడలోకి పరుగెత్తి రావాలి అదే... iv. జల్దారు వృక్షపు నీడ  (పరమ 2:3) (ఇది యేసుప్రభువు యొక్క రెక్కల నీడ. ఈ నీడలోకి వచ్చినవారికి ఆయనే ఆశ్రయం కల్పిస్తాడు. ఈ నీడలో ఆనందం, ఆశీర్వాదం, సమృద్ధి ఉంది. ఆ నీడలోకి మీరు వచ్చెదరా!) శ్రమలూ శోధనలూ వచ్చినప్పుడు నీడ కావాలి అంటూ వెదుకుతూ వెళ్తాం. మొదటి...

మంచి తీర్మానాలు | Telugu Christian Message | Ps K.Sudhakar Garu |

మంచి తీర్మానాలు తీర్మానాలు లేకపోతే... ఒకరోజు తీరుబడిగా పశ్చాత్తాపపడవలసి యుంటుంది. భవిష్యత్తును అందమైనదిగా చేసేది నువ్వు చేసే తీర్మానం! తీర్మానం ప్రమాణం వలె ఉండునట్లు చూసుకుందాం! భక్తులు చేసిన తీర్మానాలు కొన్ని... ఇవిగో... i. రూతు తీర్మానం  - రూతు 1:16 (నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అంటూ తీర్మానించుకుంది ఓ మోయాబీయురాలు. అందుకు ప్రతిఫలంగా దేవుడు ఆమెకు గొప్ప బహుమానం ఇచ్చాడు. ఏమిటది? మెస్సీయాకు ఆమె పితరురాలు అయ్యింది. ఎంత గొప్ప భాగ్యం!) ii. సమూయేలు తీర్మానం  - 1 సమూ. 12:23 (ప్రార్ధన చేయుదును- లేని యెడల అది నాకు పాపమగును అంటూ తీర్మానించాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీయుల చరిత్రలో తనదైన శైలిలో తన ముద్రను ఎలా వేశాడో మీరు చదివారా?) iii. యెహోషువ తీర్మానం  - యెహో, 24:15 (ఇశ్రాయేలీయులు అసలే అస్థిరులు, స్థిరబుద్ధి గలవారు కారు. మూర్ఖపు ప్రవర్తన గలవారు. అలాంటివారి మధ్యలో - మీరెవరిని సేవింపకోరు కున్నను, నేనును నా యింటివారును యెహోవానే సేవిస్తాము అంటూ తీర్మానించాడు. నా చుట్టూ ఉన్నవాళ్లందరూ అవిధేయులూ తిరుగు బోతులూ వాళ్ల మధ్యలో నేను పరిశుద్ధంగా జీవించలేక పోతున్నాను అంటున్నావా? యెహోషువను చూడండ...

దేవునికి కోపం పుట్టించు సందర్భాలు | Kommu Dayakar| YouTube Channel | Telugu Christian Sermons

Image