ఆంశం : ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము*
*ఆంశం : ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము*
*నేను నీ* ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు *నా కన్నులు* తెరువుము.
(కీర్తన119:18)
*📖ఈ లోకంలో*
*ఎన్ని గ్రంధాలున్ననూ * పరిశుద్ధ గ్రంధము* అని పిలువబడేది బైబిల్ అట్లాంటి గ్రంధాన్ని ఒక సామాన్యమైన పుస్తకమువలె, న్యూస్ పేపర్ లా చదివితే అర్ధం కాదు.
*ఈ లోకంలో*
ఎంత విద్య అభ్యసించినా?
*ఎన్ని డిగ్రీలు* తీసుకున్నా,
*ఆ జ్ఞానం*
పరిశుద్ధ గ్రంధాన్ని అర్ధం చేసుకోవడానికి ఏమాత్రం సరిపోదు.
*మన👀 మనో నేత్రాలు*
తెరువబడితేనే గాని, పరిశుద్ధ📖 గ్రంథములోని ఆశర్యకరమైన సంగతులను గ్రహించలేము.
*అదెట్లా సాధ్యం?👇*
*📖పరిశుద్ధ గ్రంధములో ఏముందో?*👇👇
*తెలుసుకోవాలనే*
తృష్ణ కలిగి యుండాలి.
*తెలుసు కోవడానికి* పరిశుద్ధాత్ముని సహాయం కొరకు ప్రార్ధించాలి.
*అప్పుడు మనో* నేత్రములు తెరువబడి, ఆశర్య కరమైన సంగతులను చూడగలము.
*👇ఇంతకీ, పరిశుద్ధ గ్రంధంలో ఏముంది?👇*
*• ఆయన పిలుపు*
*• దాని నిరీక్షణ*
*• పరిశుద్ధులకు స్వాస్థ్యము*
*• ఆయన మహిమైశ్వర్యము*
*• ఆయన బలము*
*• ఆయన అపరిమితమైన శక్తి*
*• ఆయన మాహాత్మ్యము*👇
*ఇవి కొన్ని*
మాత్రమే. పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించగలిగితే లెక్కకు మించిన సంగతులు నీకు/నాకు/ బోధించబడతాయి.
*మన మనో*
నేత్రములు వెలిగింప బడినందున, ఆయన మనల్ని పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యముయొక్క మహిమైశ్వర్యమెట్టిదో,
ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమునుబట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తియొక్క అపరి మితమైన మహాత్మ్యమెట్టిదో, మనం తెలిసికొనవలెనని,
మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మనకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, ప్రార్థనలయందు విజ్ఞాపన చేయుచు
( ఎఫెసీ 1:17-19)
*👉అయితే,*
పరిశుద్ధ గ్రంధములో ఈ విషయాలు మనకెందుకు అర్ధంకావట్లేదు?
*👉సమాధానం ఒక్కటే*
దావీదు వలే అట్లాంటి తృష్ణ మనకులేదు. అట్లా ప్రార్ధించిన సందర్భమూ లేదు.
అందుకే, దివ్య 📖గ్రంథములోని దివ్యమైన సంగతులు మనము తెలుసుకోలేక పోతున్నాము.
*అసలు*
తెలుసుకోలేని మనము వాటిని ఇంకెక్కడ అనుసరించగలము? *సాధ్యంకాదు.*
దావీదువలే నాట్యం చేస్తాను అని పాడే మనం, ఆయన కలిగిన తృష్ణను కలిగియుండీ. ఆయనలా ప్రార్ధించాలి.
*🙏ఆరీతిగా మన* *జీవితాలను సిద్ద పరచుకుందాం!*
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*మన"తండ్రియన..దేవుని ప్రేమయు,రక్షకుడైన యేసుక్రీస్తు..కృపయు,* *పరిశుద్ధాత్మ* *సహవాసము.సన్నిధి* *మనకందరికి* *తోడైయుండును గాక.*
*ఆమేన్.ఆమేన్. ఆమేన్*
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
Comments
Post a Comment