Telugu Christian Message || Sunday Service || Bro Kommu Bhagavan Das
Message By : Bro Kommu Bhagavan Das
ఒకానొక ఊర్లో బీద కూలివాడు ఉండేవాడు..
ఒకరోజు ఒక చెక్కల వ్యాపారి దగ్గరకు వెళ్లి ఏదైనా పని చెప్పండి అని బ్రతిమలాడేడు ...
చెక్కల వ్యాపారి సరే అని చెప్పి. జీతం మాత్రం నువ్వు ఎంత చేస్తే అంత అని చెప్పాడు..
కూలివాడు నాకు నా,పిల్లలకు రోజుకు బ్రతకడానికి 100 రూపాయలు అవసరము అవుతాయి .కాబట్టి నాకు 100 రూపాయలు ఇస్తే చాలు అన్నాడు.
అప్పుడు కలప వ్యాపారం చేసే యజమాని అలా కుదరదు...
నీ పనికి తగ్గట్టుగా నీ జీతం
ఉంటుంది.. పని ఎంత ఎక్కువగా చేస్తే అంత డబ్బు వస్తుంది.. అని బదులిచ్చాడు..
కూలివాడు తప్పక సరే అన్నాడు..
కూలివాడు యజమాని చెప్పిన ఒప్పందానికి సరే అని చెప్పాడు. అప్పుడు ఆ యజమాని ఆ కూలివాడికి
ఒక మంచి బలమైన కత్తి ఒకటిచ్చి అడవిలో పెద్ద పెద్ద చెట్ల మ్రానులను నరికి తెమ్మన్నాడు...
కూలివాడు సరే అని వెళ్లి అడవిలో చెట్లను నరకడం మొదలుపెట్టేడు..
ఎలాయితేనే పొద్దు కునికే సరికి 15 చెట్లను నరికి వాటిని తెచ్చి యజమానుడుకి అప్పజేప్పేడు.
యజమానుడు భళా దాసుడా.. ఎవరైనా ఒక్కరోజులో 7 చెట్లకంటే ఎక్కువగా నరకలేరు...
నువ్వు ఏకం గా 15 చెట్లు నరికావు...
భళా అని పొగిడి.. నువ్వు మొదటి రోజే చాల ఎక్కువ
కష్టపడ్డావ్ అని మెచ్చుకుని. చెట్టుకు 10 రూపాయలు చప్పున ఆ కూలివాడుకి 150రూపాయలు
ఇచ్చాడు..
ఆ కూలివాడు మరుసటి రోజు అడవికి వెళ్లి ఇంకా ఎక్కువ కష్టపడితే ఇంకా డబ్బులువస్తాయి కదా అని
మొదటి రోజు కంటే ఎక్కువ సేపు కష్టపడి పోద్దు కునికేసరికి 10 చెట్లను నరికి తెచ్చి యజమానుడుకి చెట్టుకు 10 రూపాయలు చప్పున 10 చెట్లు అప్పజెప్పి
100 రూపాయలు కూలి తీసుకున్నాడు..
మూడవరోజు కూలివాడు ఇంకా కష్టపడి పనిచేసి పోద్దు కునికేసరికి 5 చెట్లు నరికి యజమానుడుకి అప్పజెప్పి చెట్టుకు 10 రూపాయలు చప్పున
50 రూపాయలు తీసుకుని వెళ్ళిపోయాడు...
మరుసటి రోజు ఎలా అయిన ఎక్కువ చెట్లు నరకాలని వేకువ జామున చీకటితో బయలుదేరివెల్లి ఆ అడవిలో ఎన్నడులేనంత గా కష్టపడి వేకువజామున నుండి చీకటి పడేవరకు కష్టపడి ఒకే ఒక చెట్టు నరికి యజమానుడుకి అప్పజేప్పేడు .
అప్పుడు ఆ యజమానుడు చెట్టుకు 10 రూపాయలు చొప్పున పది రూపాయలు తీసి ఆ పనివాడి చేతిలో
పెట్టాడు.
పనివాడు పది రూపాయల నోటు వైపు దీనముగా చూస్తూ శాయశక్తులా కష్టం పెంచినా ఫలితం పది రూపాయలేే అని తలంచి...
ఎంత చేస్తే అంత అన్న యజమానుడితో
ఉన్న ఒప్పందం గుర్తెరిగి చేసేది ఏమీ లేక...
వెళ్ళిపోతూ వెళ్లిపోతూ
అయ్యగారు నా కష్టం లో ఎటువంటి
లోపం లేదు.. చీకటి పడేవరకు చెమట ఓర్చి
శ్రమించాను కాని ఒకటి కంటే ఎక్కువ నరకలేకపోయాను... అని దీనముగా అన్నాడు..
అపుడు యజమానుడు నేను నీకు ఇచ్చిన కత్తికి పదును పెట్టి ఎన్నాళ్ళు అవుతుంది ??అని అడగగానే.
కూలివాడు నేను రోజు నా పనిలో మునిగిపోవడంవలన కత్తికి పదును పెట్టె సమయం నాకు లేదు... అందుకే కత్తికి ఒక్కసారికూడా
పదును పెట్టలేదు అని అన్నాడు...
అపుడు యజమానుడు అర్ధం లేని నీ శ్రమకు ,
ఆర్ధిక పతనానికి శరీర శ్రమలకి కారణం కత్తికి పదును లేకపోవటమే. అని చెప్పేడు.
కత్తి అనబడే నీ దేహానికి ప్రార్ధన అనే
పదును పెట్టి ఎన్నాళ్ళు అవుతుంది??
నీ ఆత్మ దిన దినము పదును పెట్టిన కత్తిలా ఉందా??.
లేక సంసారం ,పిల్లలు , బడి ,ఉద్యోగం , ఇల్లు, బంధువులు , భోజనం , బట్టలు , పంటలు అనే నీ సొంత జీవన బాంధవ్యాలలో పడి మునిగి
మీ జీవితాలకు ప్రార్ధన అనే ఆత్మీయ పదును లేకుండా దిన దినము మొద్దు బారిన కూలివాడి కత్తిలా కష్టం తప్ప ఫలితం లేని జీవితాలు జీవిస్తున్నారా ?...
రాతి మీద కత్తి ని రంగరించే కొలది
కత్తికి పదును వచిన్నట్టు నీ ప్రాణ ఆత్మ శరీరాలను దిన దినము క్రీస్తు అనే బండమీద పదును వచ్చేట్టు రంగరిస్తున్నారా ??
దావీదు తన ఆత్మీయ దేహమనే కత్తికి రోజు కు 7 సార్లు పదును పెట్టేవాడు అని దేవుని వాక్యం చెప్తుంది..
(కీర్తనల 119:164)
దానియేలు వంటి భక్తుడు తన ఆత్మీయ దేహమనే కత్తికి రోజుకు మూడు సార్లు పదును
పెట్టేవాడు అని దేవుని వాక్యం చెప్తుంది..
(దానియేలు 6:10)
పాత నిబంధనలో ప్రార్ధన అనే ఆత్మీయ పదును కు రోజుకు ఇన్ని సార్లు అన్నిసార్లు అని లెక్క ఉన్నది...
కానీ కొత్త నిబంధనలో అపోస్తులుడైన పౌలు గారు అనుదినము సమయముతో పనిలేకుండా
ప్రతీ క్షణము మన ఆత్మీయ దేహానికి ప్రార్ధన అనే పదును పెట్టాలని కోరుతున్నాడు...
(ఎఫెసీ 6:18)
హేజ్కియా ప్రార్ధన అనే కత్తిపదును
ఫలితం.. 15 ఏండ్లు వయసు తిరిగి పొందడం.
(2 రాజులు 19:14-19 )
యోసేపు కత్తి పదును ఫలితం ఐగుప్తు ప్రధానమంత్రి అవ్వటమే....
(ఆది 41:40)
హన్నా ఒక్క రోజులో పెట్టిన ప్రార్ధన పదును ఫలితం
గొప్ప ఇశ్రాయేలీయులు ప్రవక్త సమూయేలు పుట్టటమే....
(1సమూయేలుl 1:10-28)
ఎస్తేరు మూడు రోజుల ఉపవాస
ప్రార్ధనా పదును ఫలితం రాత్రికి రాత్రే ఇశ్రాయేలీయులు మరణ శాసనము జీవ శాసనముగా మారటమే...
(ఎస్తేరు 4:16; 5:1-14)
పేదవాడు లాజరు కష్టాలలో కన్నీళ్లలో బాధలలో ఇరుకు, ఇబ్బందులలో పెట్టిన ప్రార్ధన అనే కత్తి పదును
ఫలితం పరలోకమే...
(లూకా 16:14-31)
ప్రార్థన పదును ఫలితం... ఎటువంటి సమస్యనైనా సులువుగా కోసిపారేయడమే..
( రోమా 8:37)
అవును ప్రియ విశ్వాసులారా ప్రార్దన లేని జీవితం , పదును లేని మొద్దుబారిన కత్తిలాంటిది..
ఏవేవో శ్రమలు పడతాం కాని ఫలితం ఆవిరి..... కష్టపడుతున్న.. కష్టపెట్టే పరిస్థితులు మాత్రం
మారనే మారవు
పదునైన ప్రార్ధనతో మాత్రమే గోప్పవిజయాలు సాధించగలము..
సమస్యలను పదునైన ప్రార్ధనతో రోజు రోజూ నరుకుతూ పోతే మన జీవితాలలో ఇక మిగిలేవి విజయాలే పదును లేని కత్తితో చెట్లు
నరకటం అసాద్యం...
ప్రార్ధనా పదును లేని విశ్వాసి సమస్యలను
ఎదురుకోవటం అసాద్యం...
కాబట్టి .. నా ప్రియ సహోదరి..సహోదరులారా
నీ ఆత్మీయ దేహామనే కత్తికి పదును
ఎలా పెడుతున్నావ్.?
ఈరోజే నిన్ను నువ్వు తనిఖీ చేసుకో..
మోషే తన చేతులు ఎత్తి ప్రార్ధన అనే కత్తి పదును పెడుతున్నంత సేపు విజయము దేవుని పిల్లలదే అని గమనించు
ఈరోజే క్రీస్తు అనే బండమీద నీ దేహానికి
ప్రార్దన అనే పదును పెట్టు..
కూలివాడి మొండి కత్తిలా దిన దినము నీ అభివృద్ధి నశించేలా కాకుండా ఎప్పటికప్పుడు ప్రార్దన ద్వారా
పదును పెడుతూ పదింతలుగా,ఇరువదింతలుగా,ముప్పదింతలుగా
,అరువదింతలుగా,నూరింతలుగా దిన దినాభివృద్ది పొందమని దేవుని దీవెనలు పొందమని దేవుని నామములో కోరుతున్నాను.
ఆమెన్.
Comments
Post a Comment