Telugu Christian Message || Sunday Service || Bro Kommu Bhagavan Das
Message By : Bro Kommu Bhagavan Das ఒకానొక ఊర్లో బీద కూలివాడు ఉండేవాడు.. ఒకరోజు ఒక చెక్కల వ్యాపారి దగ్గరకు వెళ్లి ఏదైనా పని చెప్పండి అని బ్రతిమలాడేడు ... చెక్కల వ్యాపారి సరే అని చెప్పి. జీతం మాత్రం నువ్వు ఎంత చేస్తే అంత అని చెప్పాడు.. కూలివాడు నాకు నా,పిల్లలకు రోజుకు బ్రతకడానికి 100 రూపాయలు అవసరము అవుతాయి .కాబట్టి నాకు 100 రూపాయలు ఇస్తే చాలు అన్నాడు. అప్పుడు కలప వ్యాపారం చేసే యజమాని అలా కుదరదు... నీ పనికి తగ్గట్టుగా నీ జీతం ఉంటుంది.. పని ఎంత ఎక్కువగా చేస్తే అంత డబ్బు వస్తుంది.. అని బదులిచ్చాడు.. కూలివాడు తప్పక సరే అన్నాడు.. కూలివాడు యజమాని చెప్పిన ఒప్పందానికి సరే అని చెప్పాడు. అప్పుడు ఆ యజమాని ఆ కూలివాడికి ఒక మంచి బలమైన కత్తి ఒకటిచ్చి అడవిలో పెద్ద పెద్ద చెట్ల మ్రానులను నరికి తెమ్మన్నాడు... కూలివాడు సరే అని వెళ్లి అడవిలో చెట్లను నరకడం మొదలుపెట్టేడు.. ఎలాయితేనే పొద్దు కునికే సరికి 15 చెట్లను నరికి వాటిని తెచ్చి యజమానుడుకి అప్పజేప్పేడు. యజమానుడు భళా దాసుడా.. ఎవరైనా ఒక్కరోజులో 7 చెట్లకంటే ఎక్కువగా నరకలేరు... నువ్వు ఏకం గా 15...