అమ్మాయిల పిచ్చి నీకుందా...?... అయితే విను..!! ||Telugu Christian Message|| Youth||


అమ్మాయిల పిచ్చి నీకుందా...?... అయితే విను..!!
♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️
🔺పురుషుడిని, స్త్రీని ఒక ఉద్దేశ్యంతో దేవుడు సృష్టించాడు. ఒక పురుషుడు ఒక స్త్రీకి మాత్రమే బద్ధుడై, ఒక స్త్రీ ఒక పురుషుడికి మాత్రమే బద్దురాలై బ్రతకాలని దేవుడి యొక్క ఆశ. అనివార్య పరిస్థితిలో భర్త చనిపోతే మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం దేవుడు తప్పు పట్టడం లేదు కానీ.. అక్రమ సంబంధానికి మాత్రం దేవుడు పూర్తిగా వ్యతిరేకి. భార్య ఉండగా వేరో స్త్రీతో.. అలాగే భర్త ఉండగానే వేరే వ్యక్తితో అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నట్లైతే ఆ ఊబి నుంచి బయటపడితే మంచిది. 

🔺మరో విషయం ఏంటంటే.. పాపిష్టి తలంపులు వస్తే పెళ్లి చేసుకోవాలని బైబిల్ సెలవిస్తుంది. నీకు అలాంటి తలంపులు వస్తే చక్కగా పెళ్లి చేసుకో..నీ భార్యతో నీవు తృప్తిపొందు కానీ పరాయి అమ్మాయితో పరిచయం పెట్టుకుని... ఆమెతో నీవు తృప్తి చెందడం మహా ఘోర పాపం. "నీ ¸యౌవనకాలపు భార్యయందు సంతోషింపుము. ఆమె అతిప్రియమైన లేడి, అందమైన దుప్పి ఆమె రొమ్ములవలన నీవు ఎల్లప్పుడు తృప్తినొందు చుండుము. ఆమె ప్రేమచేత నిత్యము బద్ధుడవై యుండుము. పరస్త్రీ రొమ్ము నీవేల కౌగలించుకొందువు?.  నరుని మార్గములను యెహోవా యెరుగును. వాని నడతలన్నిటిని ఆయన గుర్తించును. (సామెతలు 5:18-21).  

🔺అలాగే పెళ్లి కాకుండానే వేరే అబ్బాయిలు, అమ్మాయిలతో అక్రమ సంబంధం పెట్టుకోవడం చాలా దారుణం... నీవు ఇటువంటి రాంగ్ రూటులో పోతున్నట్లైతే పరిస్థితులు చేజారకముందే మేల్కొంటే ఉత్తమం...లేకుంటే దేవుని తీవ్ర ఉగ్రత్తకు బలికాక తప్పద్దు. 

🔺స్యయంగా దేవుడే చెప్పాడు... పరస్త్రీ రొమ్ము నీవేల కౌగలించుకొందువు? అని. మరీ నీవు పరాయి అమ్మాయిలు, అబ్బాయిలతో పాపం చేస్తూ... వారి శరీరాలను తాకుతుంటే... దేవుడు చూస్తూ... సైలెంట్ గా ఎలా ఉంటాడు. ఆ రోజు పక్కింటి స్త్రీతో పాపం చేసిన దావీదును విడిచి పెట్టని దేవుడు... నిన్ను, నన్ను విడిచి పెడతాడా? పొరపాటున విడిచిపెట్టాడు. కాస్త సమయం పట్టొచ్చు, ఏదో ఒకరోజు... దేవుని శిక్షకు తల వంచాల్చిందే. ఆరోజు దావీదు చేసిన పాపానికి శిక్ష ఏమీ అనుభవించాడో తెలుసా? నలుగురు కుమారులను కళ్లముందు లేకుండా చేసుకున్నాడు. 

🔺దావీదు చేసిన ఆ ఒక్క పాపానికే.... దేవుడు అంత ఘోరమైన శిక్ష విధించాదంటే.... మరీ నీవు ఇప్పటి వరకు ఎన్ని తప్పులు, ఎన్ని పాపాలు చేశావో... ఒక్కసారి ఆలోచించుకో..! అయినప్పటికీ దేవుడు నిన్ను ఘోరమైన శిక్షకు అప్పగించ లేదంటే... చూస్తున్నాడు... చూస్తున్నాడు... నీ తిక్క పనులను.... ఇప్పటివరకు ఓపిక పట్టాడు... ఇక నీ పట్ల దేవుడు ఓపిక పట్టలేక పోతున్నాడు. అందుకే ఈ చివరి అవకాశాన్ని ఓ వరంలా నీకు అందిస్తున్నాడు. ఇచ్చిన ఈ చివరి వరాన్ని బంగారంలా మార్చు కుంటావో... లేక ఇనుము లా మార్చుకుంటావో... అంతా నీ అరచేతిలోనే ఉంది.

🔺పరాయి స్త్రీ జోలికి పొవద్దని, ఓ స్త్రీ వైపు మోహపు చూపులు చూస్తేనే ఆమెతో వ్యభిచారించినట్లు అని బైబిల్ ఖరాఖండిగా సెలివిచ్చింది).. మరీ బైబిల్ మాటకు రివర్స్ లో జీవిస్తే... ఘోర మైన శిక్ష ఉండదంటారా..?

🔺చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆ రోజు దేవుడు ఒక వ్యక్తిని సృష్టించి.. ఇద్దరు, ముగ్గురు స్త్రీలను సృష్టించలేదు.. లేక ఒక స్త్రీని సృష్టించి ఇద్దరు లేక ముగ్గురు వ్యక్తులను సృష్టించ లేదండీ... ఒక ఆదాము..ఒక అవ్వను మాత్రమే సృష్టించాడు.. ఎందుకో తెలుసా..?..ఒక వ్యక్తికి ఒక స్త్రీ మాత్రమే ఉండాలి, ఒక స్త్రీకి ఒక వ్యక్తి మాత్రమే ఉండాలనే ఉద్దేశ్యంతోనే దేవుడు ఆదాము, అవ్వను సృష్టించాడు. ఈ సత్యాన్ని గ్రహించి సత్య మార్గంలో నడుస్తావని దేవుని యొక్క ఆశ... 

🔺ఒకవేళ ఒకవ్యక్తికి ఇద్దరు, ముగ్గురు లేక అంతకంటే ఎక్కువ మంది ఉండాలనేది...దేవుని ఉద్దేశ్యం అయితే... ఆదాము సృష్టించిన తర్వాత... అవ్వతో పాటు... మరో ఇద్దరు, లేక ముగ్గురు స్త్రీలను కూడా దేవుడు సృష్టించి ఉండేవాడు.

ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి..!!
🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻
1. పరాయి స్త్రీ మీద ఎప్పుడైతే మీ ఆలోచన తప్పుగా పోతుందో...అప్పుడే మీ పతనం అనేది ప్రారంభం అవుతుందని అర్థం.

2. పరాయి స్త్రీ వైపు నీ చూపు పడిన వెంటనే నీ చూపులను క్రిందకు ఉంచు ....ఇదే ఉత్తమ విశ్వాసుల గుణం.

3. పరాయి స్త్రీ వంకరగా చూసే ముందు ఒకటి ఆలోచించు...నీ భార్య మీద నీకున్న ప్రేమా అనురాగాలు ఎలాంటివో...పరాయి స్త్రీ మీద తన భర్త పెట్టుకున్న ప్రేమా అనురాగాలు అంతకంటే రెట్టింపు గొప్పవని తెలుసుకో.

4. ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను.

5. ఒక పురుషుడు ఒక భార్య. అదే దేవుని న్యాయం. 



దయచేసి ఈ క్రింది బైబిల్ రిఫరెన్స్ చివరి వరకు ఒక్క లైన్ మిస్ కాకుండా చదవాలని మనవి.
🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻
"దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును. వాడు తన పాపపాశములవలన బంధింపబడును. శిక్షలేకయే అట్టివాడు నాశనమగును. అతిమూర్ఖుడై వాడు త్రోవతప్పి పోవును." (సామెతలు 5:22-23).

"నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. నీ ఊటలు బయటికి చెదరిపోదగునా? వీధులలో అవి నీటి కాలువగా పారదగునా?. అన్యులు నీతోకూడ వాటి ననుభవింపకుండ అవి నీకే యుండవలెను గదా. నీ ఊట దీవెన నొందును." (సామెతలు 5:15-18). (నీ సొంత కుండలోని నీళ్లు అంటే నీ సొంత భార్య లేక భర్త అని అర్థం)

"నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము వివేకముగల నా బోధకు చెవి యొగ్గుము. అప్పుడు నీవు బుద్ధికలిగి నడచుకొందువు తెలివినిబట్టి నీ పెదవులు మాటలాడును. జారస్త్రీ పెదవులనుండి తేనె కారును దాని నోటి మాటలు నూనెకంటెను నునుపైనవి. దానివలన కలుగు ఫలము ముసిణిపండంత చేదు అది రెండంచులుగల కత్తియంత పదునుగలది. దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవమార్గమును ఏమాత్రమును విచారింపదు దానికి తెలియకుండనే దాని పాదములు ఇటు అటు తిరుగును. కుమారులారా, నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశమునుండి తొలగకుడి. జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసికొనుము దాని యింటివాకిటి దగ్గరకు వెళ్లకుము. వెళ్లినయెడల పరులకు నీ ¸యౌవనబలమును క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తివలన పరులు తృప్తిపొందుదురు నీ కష్టార్జితము అన్యుల యిల్లు చేరును. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు... అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని? నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను?. నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్యనుండినను ప్రతివిధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే యెడమాయెను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచు నుందువు." (సామెతలు 5:1-14).

"చెడు స్త్రీయొద్దకు పోకుండను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండను అవి నిన్ను కాపాడును. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరచుకొన నియ్యకుము. వేశ్యాసాంగత్యము చేయువానికి రొట్టెతునక మాత్రము మిగిలియుండును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనినయెడల వాని వస్త్రములు కాలకుండునా?. ఒకడు నిప్పులమీద నడిచినయెడల వాని పాదములు కమలకుండునా?. తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. దొంగ ఆకలిగొని ప్రాణరక్షణకొరకు దొంగిలిన యెడల యెవరును వాని తిరస్కరింపరు గదా. వాడు దొరికినయెడల ఏడంతలు చెల్లింపవలెను తన యింటి ఆస్తి అంతయు అప్పగింపవలెను. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును వానికి కలుగు అపకీర్తి యెన్నటికిని తొలగిపోదు". (సామెతలు 6:24-33).

(1 కోరింథి 7వ అధ్యాయంలో పౌలు భార్య, భర్తల సంబంధాన్ని చాలా చక్కగా వివరించారు.)

ఒకవేళ ఇప్పటివరకు నీకు పొరుగు స్త్రీల పట్ల యామోహం ఉంటే... ఇకనుంచి ఆ అమ్మాయిల ఊబి నుంచి బయటపడతావని ఆశిస్తున్నాను.
For more messages visit our website: www.truthgospelministries.blogspot.com
www.kommudayakar.website2.me

Comments

Popular posts from this blog

Sermon about Evangelism

Are you in Trouble?

Life Can Be Tough