నిన్ను నీవు తగ్గించుకో!

💮 *నిన్ను నీవు తగ్గించుకో!* 💮

*ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అప్పుడాయన మిమ్మును హెచ్చించును.* యాకోబు 4:10
       
ఈ మాటలు వ్రాస్తున్నది ఎవరంటే, యేసు ప్రభువు సహోదరుడు. అయితే ఆయన ఎంతగా తగ్గించుకున్నారంటే. యేసు ప్రభువు దాసుడను అని తనను తనను పరిచయం చేసుకున్నారు. 

♻️ *క్రీస్తు యొక్క తగ్గింపు*
            ఫిలిప్పీ 2:5-8

🔸దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, 
🔸దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు 
🔸మనుష్యుల పోలికగా పుట్టి, 
🔸దాసుని స్వరూపమును ధరించుకొని, 
🔸తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. 
🔸సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, 
🔸తన్నుతాను తగ్గించుకొనెను.
             ఫిలిప్పీయులకు 2:5-8

దేవుడైన వాడే దాసునిగా మారడం అంటే? ఇక తగ్గింపుకు ఇంతకు మించిన మాదిరి ఎవరు? 

♻️ *ధూళియు, బూడిదైయునైన నేను*
               — అబ్రాహాము (ఆది 18:27 )

🔸 యేసు క్రీస్తు శరీర ధారిగా ఈ లోకానికి రావడానికి ఏర్పరచుకున్న వ్యక్తి
🔸దేవుని స్నేహితుడు 
🔸విశ్వాసులకు తండ్రి 
🔸భూమిమీదనున్న సమస్త వంశములు ఆశీర్వదించబడుటకు కారకుడు 

♻️ *నేనెంతటి వాడను*
      — మోషే ( నిర్గమ 3:11; 4:10)

🔸ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించినవాడు 
🔸ఇశ్రాయేలీయులను నడిపించిన నాయకుడు 
🔸భూమి మీదనున్నవారందరిలో మిక్కిలి సాత్వీకుడు 
🔸ధర్మశాస్త్రమునకు ప్రతినిధి 
🔸చేతులు పైకెత్తడం ద్వారా యుద్దములో విజయాన్ని పొందినవాడు. 

♻️ *పాపులలో ప్రధానుడను*
           — అపొస్తలుడైన పౌలు 
   ( అపో. కా. 20:19; 1తిమోతి 1:15 )

🔸అసలు పేరు సౌలు
🔸యూదా మత ప్రవిష్టుడైన గమలియేలు పాదాలచెంత ధర్మశాస్త్ర విద్య నభ్యసించి, క్రైస్తవ్యాన్ని సమూల నాశనం చెయ్యడానికి అధికారం పొంది, క్రీస్తు ప్రత్యక్షత ద్వారా  క్రీస్తు ఖైదీగా మార్చబడి, క్రీస్తును పోలి నడచినవాడు. 
🔸2nd Founder of Christianity  అని పిలువబడే వ్యక్తి
🔸బైబిల్ గ్రంధములో అత్యధికముగా 14 పత్రికలు వ్రాసినవాడు. 
🔸బైబిల్ గ్రంథములోనే సువార్త నిమిత్తమైన 'గొప్ప ప్రయాణికుడు' 
🔸అపోస్తలుడు
🔸ప్రవక్త
🔸దైవజనుడు
🔸పెద్ద 
🔸సువార్తికుడు

♻️ *చచ్చిన కుక్కను గదా! మిన్నల్లిని గదా!*.  — దావీదు (1సమూ 24:14)

🔸నూతన నిబంధన ప్రకారము యేసు క్రీస్తు వంశావళికి మూల పురుషుడు
🔸దేవుని హృదయానుసారుడు 
🔸గొప్ప సంగీత విద్వాంసుడు 
🔸దేవుని పక్షముగా యుద్దాలు చేయడానికి ప్రత్యేకపరచ బడినవాడు 
🔸ఇశ్రాయేలీయుల సమిష్టి రాజ్యానికి రెండవ రాజు

ప్రియులారా! ఇంతటి గొప్ప వ్యక్తులు ఇంతగా తగ్గించుకుంటే, కాదు అంతగా తగ్గించుకున్నారు కాబట్టే అంతటి గొప్పవారయ్యారు. మరి మన జీవితాలెట్లా వున్నాయి. నిన్ను నీవు హెచ్చించుకోవడానికి గాని, నిన్ను బట్టి నీవు అతిశయించడానికి గాని, నీకంటూ ఈ లోకంలో ఏమి లేదు. ఏదైనా వుందంటే. అది ప్రభువు నీకిచ్చినదే. నిన్ను నీవు తగ్గించుకొని, ప్రభువును హెచ్చించు! అది నీ జీవితానికి ధన్యకరము! ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు  మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

Comments

Popular posts from this blog

Sermon about Occult

Life Can Be Tough

Are you in Trouble?