విశ్వాసులకు మాదిరిగా ఉండవలసిన యవ్వనస్తులు
✝ *విశ్వాసులకు మాదిరిగా ఉండవలసిన యవ్వనస్తులు*🚶♂
(యవ్వనస్తుల ప్రత్యేకం)
♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️
_(1తిమోతి 4:12 నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింప నియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము.)_
శుభోదయం!
✳ *ఉపోద్ఘాతం:*
🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶
దేవుని సేవ విషయంలో యవ్వన బిడ్డలు ప్రభువుకు ఎంతో ఉపయోగకరంగా ఉండగలరు. దేవుని అద్భుతమైన సేవా పరిచర్యలు నెరవేర్చే విషయంలో అనుభవజ్ఞులైన పెద్దవారు మాత్రమే కాదుగాని, యవ్వనబిడ్డలు కూడా ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉన్నారని పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చు చున్నది. యవ్వన ప్రాయంలో వారు జాగ్రత్తగా ఉంటే వారు ఇతరులకు ఎంతో మాదిరికరమని పౌలు భక్తుడు చెప్పుచున్నాడు.
1తిమోతి 4:12 నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింప నియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, *విశ్వాసులకు మాదిరిగా* ఉండుము.
దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చే విషయంలో ఎంతో అద్భుతంగా యవ్వనస్తులను చరిత్రలో ఉపయోగించాడు. దేవుడు తరచూ పెద్దలైన మోషే యెహోషువ లాంటివారిని తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఉపయోగించి నప్పటికీ, చాలామంది యవ్వనస్తులను కూడా దేవుడు తన పరిచర్యలో ఘనంగా వాడినట్లు పరిశుద్ధ గ్రంధం చెప్పుచున్నది.
ఈ దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి *ఈ క్రింది యౌవనస్థులను* అద్భుతంగా వాడుకున్నాడు:
✳ *1. యవ్వనస్తుడైన యోసేపు:*
🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻
ఇశ్రాయేలీయులను కరవు కాలంలో కాపాడటానికి దేవుడు యవ్వనస్తుడైన యోసేపును వాడుకున్నాడు.
👉 యోసేపు ద్వారానే దేవుడు కరువులో నుండి తన ప్రజలను బ్రతికించాడు. ఇశ్రాయేలుకు యోసేపును ఒక మార్గంగా ఇచ్చాడు
👉 ఫోతీఫరుకు బానిసగా విక్రయించ బడినప్పుడు యోసేఫు *పదిహేడు సంవత్సరాల యవ్వనస్తుడు*– ఆది 37:2
✳ *2. యవ్వనస్తుడైన దావీదు:*
🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺
ఫిలిష్తీయుల నుండి ఇశ్రాయేలీయులను రక్షించుటకు దేవుడు యవ్వనస్తుడైన దావీదు ఘనంగా వాడుకున్నాడు
👉 అ. భయంకరుడైన గోల్యాతును చంపి ఇశ్రాయేలీయులను రక్షించింది *యవ్వనస్తుడైన దావీదు.*
👉 ఆ. సౌలు రాజుకూడా ఈ సందర్భంగా దావీదును “యువకుడని” పేర్కొన్నాడు. (తెలుగు బైబిల్ లో బాలుడు అని ఉందిగాని ఇంగ్లిష్ బైబిల్ లో “యూత్” అని ఉంది.) 1సమూ 17:33
✳ *3. యవ్వనస్తుడైన సొలోమోను:*
♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️
ఇశ్రాయేలీయుల ఖ్యాతిని అత్యున్నత శిఖరాలకు చేర్చడానికి దేవుడు *యవ్వనస్తుడైన సోలోమోనును* ఉపయోగించాడు.
👉 అ. యవ్వనస్తుడైన సొలొమోనును రాజ్య వారసునిగా దావీదు ద్వారా దేవుడే నియమించాడు.
👉 ఆ. సోలోమోను రాజైన కాని దేవుని ఎదుట తనను తాను ఒక బాలునిగా భావించుకున్నాడు. 1 రాజు 3:7
✳ *4. యవ్వనస్తుడైన యోషీయ:
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
దేవునికి యదార్థమైన ఆరాధన ద్వారా యూదా వారిని పునర్నిర్మించడానికి దేవుడు యవ్వనస్తుడైన యోషీయాను రాజుగా నియమించాడు.
👉 అ. ఎనిమిదేళ్ళ వయస్సు ఉన్నప్పుడు, యోషీయా రాజు అయ్యాడు, అతడు మంచిరాజుగా ఉన్నాడు. – 2దిన 34:1-2
👉 ఆ. పదహారెళ్ళ వయస్సులో అతడు దేవుని సేవ చేయడానికి పూనుకున్నాడు – 2దిన 34:3
👉 ఇ. ఇరవై ఏళ్ళ వయస్సులో, అతడు యూదా అంతటా పవిత్రమైన సంస్కరణలను స్థాపించాడు – 2దిన 34:3
👉 ఈ. ఇరవై ఆరు ఏళ్ళ వయస్సులో అతడు ఎంతో ధైర్య సాహసాలతో దేవాలయాన్ని పునరుద్ధరించి ఎంతో ఘనంగా పస్కాను తిరిగి స్థాపించి ఆచరించాడు. ప్రవక్త యగు సమూయేలు దినములు మొదలుకొని ఇశ్రాయేలీయులలో పస్కాపండుగ అంత ఘనముగా ఆచరింపబడి యుండలేదు. 2దిన 34:8; 35:18-19
✳ *5. యవ్వనస్తుడైన యిర్మియా:
🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺
యవ్వన ప్రవక్తయైన యిర్మీయా ద్వారా ప్రపంచ దేశాలకు దేవుడు ప్రవచనము చెప్పించాడు.
👉 అ. ప్రవక్తగా ఉండుటకు సాకు చెప్తున్న యవ్వనస్తుడైన యిర్మీయాను దేవుడు మాట్లాడి జనములకు ప్రవక్తగా ఏర్పరిచినాడు. యిర్మీయా 1:4-6
👉 ఆ. “నేను బాలుడను (I am youth) అని అనవద్దని, తాను యిర్మీయాకు తోడుగా ఉంటానని దేవుడు యవ్వనస్తుడైన యిర్మీయాను బలపరచి నోరు ముట్టి తన మాటలు ఆ యవ్వన ప్రవక్త నోట ఉంచాడు. యిర్మీయా 1:7-9
✳ *6. యవ్వనస్తుడైన దానియేలు:
🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶
యవ్వనస్తుడైన దానియేలును దేవుడు వాడుకొని సమస్త దేశాలపై తన సార్వభౌమత్వాన్ని బహిర్గతం చేశాడు.
👉 అ. దాదాపు 12 నుండి 15 సంవత్సారాల యవ్వన వయస్సులో చెరలో ఉన్న దానియేలు ద్వార దేవుడు ఈ ఘనమైన కార్యాన్ని చేశాడు. – దానియేలు 1:3-5
👉 ఆ. దాదాపు 15నుండి 18 సంవత్సరాల యవ్వన వయస్సులో ఉన్నపుడు దేవుడు దానియేలును జ్ఞానముతోను సకల శాస్త్రప్రవీణతయు వివేచనయు మరియు సకల విధములగు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివితోను నింపి నేబుకద్నేజర్ చక్రవర్తి సముఖమున నిలబెట్టాడు. దానియేలు 1:18-20
✳ *7. యవ్వనస్తుడైన తిమోతి:
🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶
తప్పి పోయిన అనేకులకు సువార్త ప్రకటించుటకు దేవుడు యవ్వనస్తుడైన తిమోతిని పైకి లేపినాడు.
👉 అ. యవ్వనస్తుడైన తిమోతిని ప్రస్తావిస్తూ, తన ప్రపంచ సువార్త దండయాత్రల ప్రయాణక్రమంలో పౌలు యొక్క సహచరుడుగా యవ్వన తిమోతి దేవుని చేత ఎంపిక చేయబడ్డాడు. అపో 6:1-3
👉 ఆ. యవ్వన వయస్సు లోనే గొప్ప ఎఫెసు సంఘానికి నాయకుడైన తిమోతి అక్కడ చాలామంది క్రైస్తవుల కంటే వయస్సులో చిన్నవాడై ఉన్నాడు. దేవుడే యవ్వన తిమోతిని ఆ పదవిలో నియమించాడు కాబట్టి అధికారంతో దేవుని వాక్కు మాట్లాడుతూ ఉండడం వల్ల తనను ఎవరూ చిన్నచూపుతో తృణీకరింపకుండా చూసుకోవాలని, తన యొక్క యవ్వన ప్రాయాన్ని బట్టి ఎవరూ కూడా తిమోతిని చిన్నచూపు చూడనివ్వకుండా విశ్వాసులకు మాటలలో, ప్రవర్తనలో, ప్రేమభావంలో, ఆత్మ విషయాలలో నమ్మకంలో, పవిత్రతలో ఆదర్శంగా ఉండాలని పౌలు యవ్వన తిమ్మోతికి ఇచ్చిన హెచ్చరిక యవ్వనస్తులందరికి ఆదర్శం. 1తిమోతి 4:12
✳ *ముగింపు:* అంతేకాకుండా దేవుడు అనేక మంది యవ్వన స్త్రీలను కూడా తన చిత్తాన్ని చేయటానికి ఉపయోగించాడు. ఈ ప్రపంచంలోకి రక్షకుడని తేవడానికి దేవుడు యవ్వన కన్య అయిన మరియను ఉపయోగించాడు.
అవును యవ్వన వయస్సులో మరియు అనేక అవమానాలను సహించి, ఏమాత్రం పిరికితనం చూపక దేవుని కొరకు ఘనమైన పరిచర్య చేయడానికి అనితర సాధ్యంగా తన జీవితాన్ని వినియోగించింది.(లూకా 1:26-33)
ప్రియ దేవుని బిడ్డలారా! గొప్ప విషయాలను నెరవేర్చడానికి దేవుడు చాలా మంది యౌవనస్థులను ఉపయోగించాడనేది పై ఉదాహరణలను బట్టి స్పష్టమగుచున్నది.
కనుక యవ్వన బిడ్డలను తృణీకరింపకుండా మీ మద్దతు ఇవ్వండి, ఎందుకంటే ప్రభువు నేడు కూడా యవ్వనస్తుల ద్వారా ఎన్నో ఘనమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
యౌవనస్థులను వారి వయస్సును బట్టి దేవునికి విధేయులుగా ఉండరని, వారు దేవుని సువార్తకు పనికిరారని, వారికి అనుభవం లేని కారణంగా వారు సువార్త సంబంధమైన సేవ చెడగొడతారని మాట వినరని సమయానికి రారని ఇంకా అనేక విధాలుగా వారినీ నిరుత్సాహ పరచవద్దు.
యవ్వన వయస్సు కారణంగా వారిని చిన్న చూపు చూడవద్దు. దేవుడు యవ్వనస్తుల ద్వార ఘనమైన సేవ జరిగించునట్లు యవ్వనస్తులను ప్రోత్సాహించండి. వారి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు యవ్వనస్తులైన వారిని బహుగా దీవించి తన సేవలో ఘనంగా వారిని వాడుకొనునుగాక! ఆమేన్!!
దైవాశ్శీసులు!!!
For more messages visit our website: www.truthgospelministries.blogspot.com
www.kommudayakar.website2.me
Comments
Post a Comment