అంశం : నా కృప నీకు చాలును
Sermon by PS.Kommu Sudhakar( 13 May, 2020)
నా కృప నీకు చాలును.2 కొరింధి.12:9
కృప అంటే? "అర్హత లేనివాడు అర్హునిగా ఎంచ బడడమే కృప."
దొంగ దోచుకోవడానికి వచ్చి దొరికిపోయాడు. అతనిని ఏమి అనకుండా క్షమించి విడచి పెట్టేస్తే అది జాలి, దయ అని చెప్పొచ్చు. అట్లా కాకుండా అతనికి భోజనం పెట్టి, బస్ చార్జీలు ఇచ్చి పంపిస్తే? అది కృప.
ప్రభువా అని పిలువడానికి కూడా అర్హతలేని మనకు తండ్రీ అని పిలిచే యోగ్యత నిచ్చింది ఆయన కృప.
వ్యక్తిగత, కుటుంబ, మానసిక, ఆర్ధిక, సామాజిక సమస్యలతో అల్లాడిపోతున్న పరిస్థితులా?
ఏ రేవుకెళ్ళినా ముండ్ల పరిగే అన్నట్లుగా సాగిపోతుందా జీవితం?
భయపడవద్దు. దిగులు చెందవద్దు. నీ ప్రియ రక్షకుడు నీకిస్తున్న వాగ్దానం 'నా కృప నీకు చాలు'
అవును! అవి ఎట్లాంటి పరిస్థితులైనాసరే. చివరకు అది అగ్నిగుండమైనా సరే. ఆయన కృప నీకు తోడుగా వుండబోతుంది. ఆయన కృప నీకు తోడుగా వుంటే? అగ్నిగుండం సహితం నిన్నేమి చేయగలదు?
పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు (యెషయా 54:10) అని వాక్యము సెలవిస్తున్నట్లుగా...
అట్టి కృపను నిర్లక్ష్యం చెయ్యొద్దు. చులకన చెయ్యొద్దు. శోధనలగుండా సాగిపోతున్న నీవు ఈ ఒక్క మాట హృదయ పూర్వకంగా చెప్పగలిగితే? చెప్పలేనంత సమాధానాన్ని పొందుకోగలవు.
ఒక్కసారి ప్రయత్నించి చూస్తావా!
ప్రభువా! నీ కృప నాకు చాలును.
ఆమెన్! ఆమెన్! ఆమెన్
Comments
Post a Comment