Posts

Showing posts from February, 2020

TruthGospelMinistries Bible Study

యోహాను సువార్త Author: Truth Gospel Ministries Category: Bible Study Reference: www.truthgospelministries.blogspot.com అధ్యాయములు: 21, వచనములు: 879 గ్రంథ కర్త: జెబెదయి కుమారుడును, యాకోబు సహోదరుడును అపోస్తలుడైన యోహాను. రచించిన తేది: క్రీ.పూ. 85-90వ సం. మూల వాక్యాలు: 1:1,14 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆ వాక్యము శరీర -ధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. 1:29 ఇదిగో లోక పాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల. 3:16 దేవుడుreference లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. 6:29 యేసు ఆయన పంపిన వానియందు మీరు విశ్వాస ముంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను. 10:10 గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితిని. 10:27,28 నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను 11:25-26 అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే; నాయందు ...

TruthGospelMinistries Bible Study

లూకా సువార్త Author: Truth Gospel Ministries Category: Bible Study Reference: www.truthgospelministries.blogspot.com ప్రేమపూరిత పదములతో, వైద్యుడైన లూకా, మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ మానవత్వమును కడుజాగరూకతతో వర్ణించుచున్నాడు. ప్రారంభములో యేసు వంశావళిని, జననమును, బాల్యమును వివరించి వాటికి తగిన ప్రాధాన్యతను వివరించిన తరువాత కాల సంభవములను సూక్ష్మబుద్దితో తెలిపిన తదుపరి ప్రభుని బహిరంగ పరిచర్యను వర్ణింపబూనుకొన్నాడు. ఆ బహిరంగ పరిచర్య సామాన్య ప్రజలలో యేసునందు విశ్వాసము పెరుగుచుండగా మరొకవైపు ఆయన శత్రువులలో విరోధ భావములు పెరుగుచుండెను. ఇట్టి పరిస్థితులలో విశ్వసించిన వారికి శిష్యత్వపు విలువలు తరిచి తెలిసికొనుట సవాలుగా మారినది. విరోధులు మనుష్య కుమారుడు సిలువపై ఒక మృతదేహముగా వ్రేలాడుట చూచువరకు మనశ్శాంతి పొందలేదు. కాని ఆయన పురుత్థానుడైన తరువాత స్థితిగతులకు మార్పు వచ్చెను. తుదకు మనుష్య కుమారుడైన క్రీస్తులో దేవుని చిత్తము సంపూర్ణముగా నెరవేరెను. లూకా అను నామము క్రొత్త నిబంధనలో ముమ్మారు మాత్రమే చెప్పబడినది. కొలస్సీయులకు 4:14reference; 2 తిమోతికి 4:11reference; ఫిలేమోనుకు 1:24refer...

TruthGospelMinistries Bible Study

మార్కు సువార్త Author: Truth Gospel Ministries Category: Bible Study Reference: www.truthgospelministries.blogspot.com మార్కు సువార్తలోని వర్తమానమును ఒకే యొక వచనములో క్లుప్తపరచిన యెడల అది ఈ విధముగా చెప్పవచ్చును. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను. (మార్కు 10:45reference), ఈ పుస్తకం యొక్క ఒక్కొక్క అధ్యాయములో మెస్సీయ శ్రేష్ఠ జీవితమునకు కేంద్రబిందువుగా తెలియజేయునది త్యాగపూరితమైన ఆయన సేవయే.      తండ్రి చిత్తమునకు ఎల్లవేళల విధేయుడగుచు సేవలో నిమగ్నుడై ముందుకు కొనసాగుచున్న దాసునిగా మార్కు ప్రభువును చిత్రీకరించెను. వాక్యమును ప్రసంగించుచు రోగులను స్వస్థపరచుచు మరణము వరకు ఇతరుల అవసరములను నెరవేర్చు సేవలో యేసు నిమగ్నుడాయెను. పునరుత్థానుడైన తరువాత ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణ దాసులుగా ఆయన అడుగు జాడలలో నడిచే శిష్య బృందముగా ప్రభువు నియమించెను.      మార్కు అని పిలువబడుచున్న ఈ గ్రంథకర్తకు యోహాను అను మరొక పేరు కూడ ఉన్నది. (అపో. కార్యములు 12:12-15reference...

TruthGospelMinistries Bible Study

మత్తయి సువార్త Author: Truth Gospel Ministries Category: Bible Study Reference: www.truthgospelministries.blogspot.com యూదుడు యూదుని గూర్చి యూదులకు వ్రాసిన సువార్తయే మత్తయి సువార్త. ఇందు మత్తయి రచీత, యూదులు చదవరులు, యేసుక్రీస్తును గూర్చిన ప్రస్తావన. యేసును యూదుల రాజుగా, దీర్ఘకాలము నుండి ఎదురు చూస్తున్న మెస్సీయగా తెలియజేయుటయే మత్తయి యొక్క ఉద్దేశం. ఆయన వంశావళి, బాప్తిస్మము, అద్భుత కార్యములు మొదలగునవన్నియు యేసు రాజని మార్పులేని ఒకే ఉద్దేశములోనికి చదవరుల దృష్టిని నడిపించుచున్నవి. ఈ రాజు మరణము చెందుట వలన మొదట తన దృష్టికి ఓటమిగా అనిపించినప్పటికీ ఆయన పునరుత్థానము చెందుట ద్వారా విజయకరముగా మారెనని భావించెను. యూదుల రాజు జీవించుచుండెను అను సందేశము పదే, పదే ప్రతిధ్వనించుచుండెను. మత్తయి అనే పేరుకు దేవుని దానం అనే అర్థం కలదు. మత్తయికి లేవీ అనే మరొక పేరు కూడా కలదు. (మార్కు 2:14reference; లూకా 5:27reference) ఉద్దేశము : నిత్యుడైన రాజు, మెస్సీయ అని యేసును నిరూపించుట. గ్రంథకర్త : మత్తయి (లేవీ) కాలము : క్రీ.శ 60 - 65కు మధ్యలో గత చరిత్ర : రోమా గౌరవ్నమెంటు కోసం సుంకమును వసూలు చేయు ఒక ఉద్యోగస...